ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. పెద్దశంకరంపేటలో పీఏసీఎస్, కమలాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సిద్ద సంజీవరెడ్డి, నాయకులు నారాగౌడ్, మురళీపంతులు, దాచ సంగమేశ్వర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్ తదితరులున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య
డీఎల్‌పీఓ సురేశ్‌బాబు
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని డీఎల్‌పీఓ సురేశ్‌బాబు తెలిపారు. కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, భవిత కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తనిఖీచేసి పరిసరాలను, ఆవరణలోని సామాజిక ఇంకుడుగుంత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయు లు సమయపాలన పాటించాలని చెప్పారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ రామారావ్, ఇన్‌చార్జి హెచ్‌ఎం అనిత, పంచాయతీ కార్యదర్శి నగేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీలకు
ఎంపికై న విద్యార్థులు
పాపన్నపేట(మెదక్): పీఎంశ్రీ పాఠశాలల అండర్–17 విభాగం కబడ్డీ పోటీలలో పాపన్నపేట విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. మెదక్‌లో మంగళవారం జరిగిన పోటీల్లో మొత్తం 24 జట్లు పాల్గొనగా పాపన్నపేటకు చెందిన బాలురు, బాలికల జట్లు హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ రమేశ్,హెచ్‌ఎం మహేశ్వర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇండస్ మెడికేర్ పరిశ్రమలో సీఐటీయూ గెలుపు
13 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మల్లికార్జున్
తూప్రాన్: మనోహరబాద్ మండలం రామాయంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇండస్ మెడికేర్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. పరిశ్రమలో జరిగిన హోరాహోరీ పోరులో సీఐటీయూ తన జయకేతనాన్ని ఎగురవేసింది. కంపెనీలో మొత్తం 63 ఓట్లు ఉండగా, సీఐటీయూ తరఫున పోటీ చేసిన ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.మల్లికార్జున్‌కు 38 ఓట్లు రాగా..ఆయన సమీప ప్రత్యర్థికి 25 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో మల్లికార్జున్ 13 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సీఐటీయూ విజయకేతనం ఎగరేయడంపై కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు అడివయ్య, విద్యుత్ రంగ నాయకులు స్వామి పాల్గొన్నారు.


