కౌడిపల్లి(నర్సాపూర్): ఎస్జీఎఫ్ క్రీడల్లో కౌడిపల్లి, తునికి ఎంజేపీ బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ హరిబాబు మంగళవారం తెలిపారు. వాలీబాల్లో అండర్–17విభాగంలో హేమంత్, అండర్–14విభాగంలో సుశాంత్, 400మీటర్ల రన్నింగ్ అండర్–14 విభాగంలో ఉపేంద్ర ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్ హరిబాబు, ఏటీపీ జ్యోతి, పీడీ అంజలి, పీఈటీ భరత్, శేఖర్ ఉపాధ్యాయులు అభినందించారు.


