ఏఓ శ్రీదేవి
రేగోడ్ (మెదక్): ఎల్‌నినో తో రైతులు అప్రమత్తంగా ఉండాలని పంటల రక్షణ కు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ఏఓ శ్రీదేవి సూచించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ తూర్పు తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల కారణంగా జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద ని తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు కోతకు సిద్ధంగా ఉంటే వర్షం తగ్గిన తర్వాతే కోయాలని, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రెండు రోజులపాటు పురుగుమందులు, ఎరువుల పిచి కారీ చేయవద్దన్నారు. కోసిన ధాన్యాన్ని టార్పాలిన్‌తో కప్పి సురక్షితంగా నిల్వ చేసుకోవాలని తెలిపారు.
సబ్సిడీపై జొన్న విత్తనాలు
స్థానిక రైతు వేదికలో సబ్సిడీపై జొన్న (సీఎస్వీ 41) రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయ ని శ్రీదేవి తెలిపారు. నాలుగు కిలోల బ్యాగు ధర రూ.150గా ఉందన్నారు. విత్తనాలు పొందాలనుకునే రైతులు తగిన ధ్రువపత్రాలతో సంప్రదించాలన్నారు.


