బాలికల హక్కులు, భద్రతే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

బాలికల హక్కులు, భద్రతే ముఖ్యం

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

జూనియర్‌ సివిల్‌ జడ్జి సుచరిత

అల్లాదుర్గం(మెదక్‌): బాలికల హక్కులు, వారి భద్రతే ముఖ్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అల్లాదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి, మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సుచరిత తెలిపారు. మండల పరిధిలోని మస్లాపూర్‌ జెడ్పీ పాఠశాలలో సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌లో భాగంగా పోక్సో చట్టంపై బుధవారం నిర్వహించిన న్యాయఅవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాలికలు భయం లేకుండా సురక్షిత వాతావరణంలో జీవించడంతోపాటు విద్యనభ్యసించి, హక్కు లను స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు, జనార్ధన్‌, అరుణ, దేవానంద్‌, లీగల్‌ సర్వీసెస్‌ సిబ్బంది ఆంజనేయులు, పాల్గొన్నారు.

జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ జనరల్‌ సెక్రటరీగా విజయ్‌ కుమార్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ తిరుమలేశ్‌ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శిగా జవ్వాజి విజయ్‌కుమార్‌తోపాటు మేనేజింగ్‌ కమిటీ మెంబర్స్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాలి

చేగుంట(తూప్రాన్‌): ప్రభుత్వ భూములను కాపాడాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ రెవెన్యూ అధికారులకు సూచించారు. మండల కేంద్రమైన చేగుంటలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 330 సర్వే నంబర్‌లో ఉన్న భూములు, చేగుంటలోని కుంటలతోపాటు పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ...మండల కేంద్రమైన చేగుంటలోని ప్రభుత్వ భూములు, కుంటలు, కట్టుకాలువలు, చెరువు కాలువలు, మట్టి రహదారులను సర్వే చేసి పూర్తి వివరాలను గ్రామ పంచాయతీ పాలకవర్గానికి తెలియజేయాలన్నారు. రెవెన్యూ అధికారులు నిర్ధారించిన ప్రభుత్వ భూములను పంచాయతీ పాలకవర్గం చొరవతో కాపాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ స్రవంతి, ఉసర్పంచ్‌ రఫీ, వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయస్థాయి బాలల కథల పోటీలకు విద్యార్థుల ఎంపిక

హవేళిఘణాపూర్‌(మెదక్‌): జాతీయస్థాయి బాలల కథల పోటీలు 2026లో భాగంగా మండల కేంద్రమైన హవేళిఘణాపూర్‌ జెడ్పీ హై స్కూల్‌ విద్యార్థులు ఎంపికయ్యారు. 9వ తర గతి విద్యార్థి మధుప్రియ రాసిన కథ ‘పాటల ఉపాయం’, నవదీప్‌ రాసిన ‘సహాయం’కథలు జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలుగు ఉపాధ్యాయులు రాజేశం తెలిపారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి బహుమతులు పొందడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు అశోక్‌, ఎల్లమ్మ, విద్యార్థులు అభినందించారు.

జిల్లాలో కరువు

కనిపించడంలేదా..?

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లాలో నెలకొ న్న తీవ్ర కరువు పరిస్థితులు ప్రభుత్వానికి కనిపించడంలేదా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు ప్రశ్నించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో తీవ్రస్థా యిలో కరువు పరిస్థితులు నెలకొనగా ఒకే మండలాన్ని ప్రకటించడం ఎంతవరకు సమంజసమన్నారు. వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతల తో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. జిల్లా లోని కొన్ని మండలాల్లో తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని, అధికారులు మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రాములు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement