ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

మెదక్‌ కలెక్టరేట్‌: నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తున్న తమను ప్రభుత్వం వెంటనే క్రమబద్దీకరించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ అధ్యక్షురాలు ప్రియాంక, సెక్రెటరీ శ్రీలత డిమాండ్‌ చేశారు. రెగ్యులరైజ్‌ లక్ష్యంగా మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద 16 రోజులుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా బుధవారం మెదక్‌ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ..ఏళ్ల తరబడి నిస్వార్థంగా సేవలందిస్తున్న మా ఉద్యోగాలకు భద్రతలేదన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. మహిళా ఉద్యోగులకు 150 రోజులు ప్రసూతి సెలవులు ప్రకటించాలని, ప్రతీ ఉద్యోగిని రెగ్యులరైజ్‌చేసి ప్రతీనెల ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు అందించాలన్నారు. అలాగే ప్రతీ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు 20 లక్షలు జీవిత బీమాతోపాటు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించేదాకా ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజుధా బేగమ్‌, ట్రెజరీ కోటయ్య, అమృత్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌, విజిత, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement