ధాన్యాన్ని తరలకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యాన్ని తరలకుండా చూడాలి

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

● జిల్లాలో మరిన్ని కరువు మండలాలు ప్రకటించకపోతే ఆందోళనే ● ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్‌

● జిల్లాలో మరిన్ని కరువు మండలాలు ప్రకటించకపోతే ఆందోళనే ● ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): కరువును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యాపారులు చెల్లించేధరను చెల్లించి మన ధాన్యం పక్కరాష్ట్రాలకు వెళ్లకుండా చూడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్‌ చేశారు. మండంలోని తునికి, రాయిలాపూర్‌, మహమ్మద్‌నగర్‌, తిమ్మాపూర్‌ తదితర గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వరిధాన్యం పండలేదని దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు రూ.3 వేల నుంచి రూ.3,300 వరకు అధికధర చెల్లించి ఇక్కడి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. జిల్లాలో ఒక్క మండలాన్నే కరువు మండలంగా ప్రకటించారని ఇది సరికాదన్నారు. ఏ ప్రాతిపదికన కరువు మండలాలను ఎంపిక చేశారో పునఃపరిశీలన చేయాలన్నారు. జిల్లాను కరువు మండలంగా ప్రకటిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. కరువు మండలాలు ప్రకటించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ చిన్నంరెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సార రామాగౌడ్‌ ఏఓ స్వప్న, ఏఈఓ సౌజన్య సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement