మెదక్ ఆర్డీఓ రమాదేవి
నిజాంపేట(మెదక్): భూ భారతి భూముల రీ–సర్వే తో రైతులకు న్యాయం చేకూరుతుందని నిజాంపేట మండల పరిధిలోని వెంకటపూర్ కె.గ్రామంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గ్రామంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివా స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రమాదేవి పాల్గొని మాట్లాడారు. ఏళ్ల తరబడి మోకా పై సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని స్పష్టం చేశారు. అక్రమంగా పట్టా లు పొంది ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ పట్టాలను రద్దు చేస్తా మని హెచ్చరించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ముందుగా గ్రామంలో ని భూముల హద్దులను నిర్ధారించడం ద్వారా భూములపై స్పష్టత రావడంతో పాటు ప్రభుత్వ భూములను గుర్తిస్తామన్నారు. పట్టా ఉండి మోకా పై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా లేని సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపా రు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేయర్లు, ప్రజల సహ కారంతో ఈ ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీ ల్యాండ్ సర్వేయ ర్ కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్, పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామాయంపేటలో...
రామాయంపేట(మెదక్): అంతకుముందు రామాయంపేట మండలంలోని దామరచెరువు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రమాదేవి పాల్గొని మాట్లాడారు.


