పిల్లల రక్షణకే పోక్సో | - | Sakshi
Sakshi News home page

పిల్లల రక్షణకే పోక్సో

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

సీనియర్‌ సివిల్‌ జడ్జి సిరిసౌజన్య

సీనియర్‌ సివిల్‌ జడ్జి సిరిసౌజన్య

మెదక్‌ కలెక్టరేట్‌: పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చిందని సీనియర్‌ సివిల్‌ జడ్జి సరి సౌజన్య పేర్కొన్నారు. మెదక్‌ కేజీబీవీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌–ఏ పాన్‌ ఇండియా స్కూల్‌ అవేర్నెస్‌ కాంపెయిన్‌’పేరుతో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి సిరిసౌజన్య పాల్గొని మాట్లాడారు. పిల్లలను లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, దోపిడీ నుంచి రక్షించడానికి ఈ చట్టం అమలులో ఉందన్నారు. పిల్లలపై జరిగే వేధింపులను గుర్తించి, వాటిని నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులకు చెప్పడం అందరి బాధ్యత చెప్పారు. ఏ స్పర్శ వల్లనైనా పిల్లలకు అసౌకర్యంగా లేదా భయంగా అనిపించినా, వారు ధైర్యంగా వద్దు అని చెప్పవచ్చని నేర్పించాలన్నారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే, వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పెద్దలకు తెలియజేయాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్‌ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటో లు పంచుకోకూడదన్నారు. ఆన్‌లైన్‌లో ఎవరైనా బెదిరించినా, అసభ్యకరమైన సందేశాలు పంపినా, ఫొటోలతో వేధించినా భయపడకుండా తల్లిదండ్రులకు లేదా పోలీసులకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కవిత, ఎస్సై మాణిక్‌ ప్రభు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement