ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థం బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారిని ఆదుకునేందుకు రక్తదాత లు ముందుకు రావాలన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగనాథ్, సీఐలు మహేశ్, సందీప్‌రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు రామకృష్ణ, శైలేందర్ పాల్గొన్నారు.


