మిల్లర్ల మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల మాయాజాలం

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

తాజాగా రంగంపేట మిల్లు రూ.8 కోట్ల విలువైన ధాన్యం మాయం కేసు నమోదు చేసిన అధికారులు

మెదక్‌ కలెక్టరేట్‌/కొల్చారం(నర్సాపూర్‌): జిల్లాలోని కొల్చారం మండలం రంగంపేటలో గల ఓ రైస్‌మిల్లుపై సివిల్‌ సప్లయ్‌ టాస్క్‌ఫోర్స్‌ విజిలెన్స్‌ బృందం తనిఖీలు చేపట్టగా సుమారు రూ.8కోట్ల విలువైన 3,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటన ఈనెల 25న ఆదివారం నిర్వహించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొల్చారం రంగంపేట కేంద్రంగా నడుస్తున్న దుర్గాభవాని బిన్ని రైస్‌ మిల్‌ యాజమాన్యం గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో రైతులనుంచి కొనుగోలు చేసిన దాదాపు రూ.8 కోట్ల విలువైన 3,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో గత ఆదివారం విజిలెన్స్‌ అధికారులు రైస్‌ మిల్‌కు చేరుకోగా తాళాలు వేసి ఉండటం, రైస్‌మిల్లును సీజ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులు, తాళాలను అదే గ్రామానికి చెందిన మరో రైస్‌మిల్‌ యజమానికి అప్పగించారు. అక్కడి నుంచి సదరు రైస్‌మిల్లు యజమాని కౌడిపల్లి మండల కేంద్రంలో గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి చెందిన గోదాంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన మరికొంత ధాన్యాన్ని నిల్వచేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు ధాన్యాన్ని అక్కడ్నుంచి ఖాళీ చేసినట్లు సమాచారం. ఆదివారం అక్కడికి వెళ్లి తాళాలు పగలగొట్టి చూసిన విజిలెన్స్‌ అధికారులకు ధాన్యం బస్తాలు కనిపించలేదు. సదరు మిల్లు యజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే తనిఖీ సమయంలో మిల్లు యజమానులు అందుబాటులో లేనట్లు సమాచారం.

తవ్వినకొద్దీ బయట పడుతున్న అక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement