విద్యార్థులను ప్రోత్సహించండి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ప్రోత్సహించండి

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

డీఈఓ రాజు

డీఈఓ రాజు

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌ ఇన్నవేటర్స్‌ ఛాలెంజ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డీఈఓ రాజు తెలిపారు. శనివారం డీఈఓ కార్యాలయం నుండి జిల్లాలోని ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో వర్చువల్‌ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఐడియాలను నవంబర్‌ 6వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీ, తెలంగాణ మోడల్‌ స్కూల్‌, గురుకుల పాఠశాలలకు చెందిన 6 నుంచి 10 తరగతి విద్యార్థులు అర్హులని తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిపుణుల కమిటీ ఉత్తమమైన 30 ఐడియాలను ఎంపిక చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులను నవంబర్‌ 11 లేదా 12వ తేదీన జిల్లాస్థాయిలో ప్రదర్శిస్తామన్నారు. ఇందులో ఉత్తమమైన మూడింటిని ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేస్తారని వివరించారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు పంపిస్తామన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. అదనపు సమాచారం కోసం జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి (8328599157) నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకాడమిక్‌ అధికారి సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి పాల్డొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement