రామాయంపేట(మెదక్): బీసీ–డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ–ఏలోకి చేర్చాలని సీఎం ప్రకటించడాన్ని నిరసిస్తూ శనివారం రజక సంఘం సభ్యులు రామాయంపేటలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా వారు ఎంపీపీ కార్యాలయం వద్ద నుంచి అంబేడ్కర్ చౌరాస్తా వరకు ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైటాయించారు. ఈసందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, జిల్లా గౌరవాధ్యక్షుడు సిద్దరాంలు మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ముదిరాజ్‌లను ఏ గ్రూపులో చేరిస్తే, అందులో ఉన్న 57 కులాల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు. సీఎం వైఖరి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా అందుకు సీఎం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనకారులను సముదాయించి పోలీసులు పక్కకు తప్పించారు. నిరసనలో నాయీబ్రాహ్మణ, వడ్డెర, గంగపుత్ర సంఘాల ప్రతినిధులు నాయ కులు త దితరులు పాల్గొన్నారు.


