సౌర విద్యుత్‌కు కేంద్రం ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌కు కేంద్రం ప్రోత్సాహం

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

మెదక్‌ కలెక్టరేట్‌: సూర్యశక్తితో ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ‘పీఎం సూర్యఘర్‌ ముప్త్‌ బిజీలి యోజన’ పథకం ప్రవేశపెట్టారని ఉమ్మడి మెదక్‌ జిల్లా రెడ్‌కో డీఎం రవీందర్‌చౌహన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం సేవా సేతు అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్‌ ఎస్‌ఈ నారాయణ నాయక్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎం హాజరై మాట్లాడారు. కరోనాతో ఈ పథకం ముందుకు సాగలేకపోయిందన్నారు. ఇటీవల పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు 3 కిలో వాట్ల సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటు చేసుకుంటే రూ.2 లక్షల ఖర్చు అవుతుందన్నారు. ఇందులో రూ.78 వేలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుండగా, మిగితా డబ్బులను బ్యాంకుల ద్వారా రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. సుమారు 25 ఏళ్ల వరకు ఎలాంటి కరెంట్‌ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదని వివరించారు. కాగా మొదటిరోజు నిర్వహించిన సేవాసేతు కార్యక్రమానికి 16 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీఈ రామేశ్వర్‌, డీటీ టెక్నికల్‌ శ్రీనివాస్‌, ఏడీ మోహన్‌బాబు, ఏఈ నవీన్‌, ఏఐ సోలార్‌ వెండర్‌ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెడ్‌కో ఉమ్మడి జిల్లా డీఎం రవీందర్‌ చౌహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement