గాంధీ చూపిన మార్గం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

గాంధీ చూపిన మార్గం ఆదర్శం

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: మహాత్మగాంధీ ఆశయాలు అందరికి ఆదర్శ ప్రాయమని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని క్యాంపు ఆఫీస్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర కోసం మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ యూనస్‌, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మెదక్‌ పట్టణంలోని రాందాస్‌ చౌరస్తాలో భారత్‌ స్కౌట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement