సత్వర పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం చూపాలి

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

సత్వర పరిష్కారం చూపాలి రీసర్వే త్వరగా పూర్తి చేయాలి నేడు సిద్ధ్దివినాయక ఆలయంలో అంగారక చతుర్థి

మెదక్‌జోన్‌: ప్రజావాణి ప్రతి ఫిర్యాదులపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పరిష్కారంలో జాప్యం చేయకుండా విచారణ పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): భూముల రీసర్వే త్వరగా పూర్తి చేయాలని జిల్లా సర్వే అధికారి కిషన్‌ తెలిపారు. సోమవారం కౌడిపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో పాంపల్లి, అంతారం గ్రామాల్లో జరుగుతున్న సర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాంపల్లిలో సర్వే పూర్తి కాగా రైతులు భూముల వివరాలతో నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అంతారంలోని పలువురు రైతుల వ్యవసాయ భూములు చిలప్‌చెడ్‌ మండల సోమక్కపేటలో ఉన్నాయని, దీంతో జాయింట్‌ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. రీసర్వే పూర్తికాగానే రైతులు సర్వేకు సంబంధించిన సమస్యలపై నోటీసులు అందచేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కృష్ణ, శివప్రసాద్‌, సర్వేయర్లు అనురాధ, మొగులయ్య, రవిప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.

శ్రీకాంత్‌గౌడ్‌కు

జాతీయ పురస్కారం

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): మండల పరిధిలోని జగ్గంపేటకు చెందిన ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు దొమ్మాట శ్రీకాంత్‌గౌడ్‌ కాళోజీ తెలుగు భాష వైభవ జాతీయ పురస్కారంతో పాటు స్వర్ణనంది అవార్డు అందుకున్నారు. సాహితి సేవారంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు శ్రీకాంత్‌గౌడ్‌కు హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో హాస్యనటుడు ఆర్‌ఎస్‌ నంద చేతులమీదుగా పురస్కారం అందజేశారు. అలాగే హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో /్ఞాని శతక, బెస్ట్‌ లిరిక్స్‌ రైటర్‌గా అభివర్ణిస్తూ శ్రీకాంత్‌గౌడ్‌కు స్వర్ణనంది ఆవార్డు అందజేశారు.

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని రేజింతల్‌ శివారులో స్వయంభూగా వెలసిన సిద్ధ్ది వినాయక ఆలయంలో మంగళవారం అంగారక చతుర్థి కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా సమీపాన గల కర్నాటక, మహారాష్ట్రాకు చెందిన భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దైవదర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు కర్నాటక బీదర్‌కు చెందిన భక్తులు కాలినడకన ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ట్రస్టు సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement