నర్సాపూర్ రూరల్: అధ్యాపకుల కృషి అభినందనీయమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హు స్సేన్ అన్నారు. సోమవారం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన డాక్టర్ అనిత, రమేశ్, ఖాజా ఆరిఫ్‌ను అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో కలిసి సన్మానించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కెరీర్ అడ్వాన్‌మెంట్ స్కీం కింద ముగ్గురు అధ్యాపకులకు పదోన్నతి లభించిందన్నారు. అనంతరం అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రపంచ, దేశీయ పర్యాటక రంగం యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై విద్యార్థులకు సెమినార్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సమీరా నజ్మీన్, ఆడెప్ప, రవికుమార్, సురేష్ కుమార్, రుక్మిణి దేవి, హేమంత్ కుమార్, మహేందర్ రెడ్డి, ఎస్ రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.


