దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి కృషి

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి కృషి బీఆర్‌ఎస్‌లో చేరికలు బీసీ కులగణన చేపట్టాలి

జిల్లా మానిటరింగ్‌ అధికారి రాజు

పెద్దశంకరంపేట(మెదక్‌): దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా మానిటరింగ్‌ అధికారి రాజు అన్నారు. శుక్రవారం స్థానిక పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో అల్లాదుర్గం, రేగోడ్‌, టేక్మాల్‌, పెద్ద శంకరంపేట మండలాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ– సమగ్ర శిక్షా, భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యా ర్థులకు ఉచిత సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో ఆయా పాఠశాలలకు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి అవసరమైన ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, కృత్రిమ అవయవాలు, సహాయ ఉపకరణాల కోసం అర్హులైన వారిని గుర్తించారు.

నర్సాపూర్‌: ఎమ్మెల్యే సునీతారెడ్డి సమక్షంలో పలువురు నాయకులు శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. మండలంలోని గూడెంగడ్డకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులు మహేశ్‌, బాల్‌రాజ్‌లకు సునీతారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై ప్రజలలో విశ్వాసం పెరగడంతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు శేకర్‌, నాయకులు బబియా తదితరులు ఉన్నారు.

రామాయంపేట(మెదక్‌): బీసీల కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సక్రమంగా కులగణన నిర్వహించకపోవడంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కులగణన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ విషయమై దళలవారీగా ఆందోళన చేపట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్‌ 4న పాలమూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. సమావేశంలో సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ మామిడి సిద్దరాంలు, నియోజకవర్గ కన్వీనర్‌ ఉడుత రాజేశం పాల్గొన్నారు.

రెండు లేన్లుగా విస్తరించాలి

రామాయంపేట(మెదక్‌): మెదక్‌– బొడ్మట్‌పల్లి రోడ్డును రెండు లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను పలుమార్లు రోడ్డు భవనాల శాఖ మంత్రికి విన్నవించనట్లు తెలిపారు. గతంలో నిర్మించిన ఈరోడ్డు ప్రస్తుతం రద్దీగా మారిందని, జాతీయ రహదారిని కలిపే ఈరోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement