● అధికారులు పనితీరుమార్చుకోవాలి
● ‘దిశా’ సమావేశంలో ఎంపీ రఘునందన్‌రావు ఆగ్రహం
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి నిధులు ఇస్తుంటే అధికారులు కనీస సమా చారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని, ప్రొటోకాల్ పాటించకుంటే సహించేది లేదని ఎంపీ రఘునందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశా కమిటీ సమావేశానికి కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా అధికారులతో కలిసి చర్చించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆయిల్‌పాం సాగుకు కేంద్రం పెద్దఎత్తున నిధులు ఇస్తుంటే రైతులకు సమాచారం ఇవ్వకుండా పథకాన్ని నీరుగారుస్తున్నారని ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ ముస్కాన్‌లో రిస్క్ చేసిన పిల్లలు ప్రస్తుతం ఎక్కడున్నారని, వెంటనే సమాచారం ఇవ్వాలని ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ హేమభార్గవిని ఆదేశించారు. చెరువులలో మురికి నీరు చేరకుండా ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పనులు చేస్తున్నారా? అని మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. అనంతరం అభివృద్ధి పనులపై ఎంపీ చర్చించారు.
ఎల్‌నినోపై అప్రమత్తం
ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో వీబీ జీ రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ తయారీపై అధికారులతో సమావేశం నిర్వహించారు.


