అధికారుల తప్పు.. | - | Sakshi
Sakshi News home page

అధికారుల తప్పు..

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

వాహనాలకు తుప్పు

మెదక్‌ కలెక్టరేట్‌: చెత్త సేకరణ వాహనాలపై అధికారుల చిత్తశుద్ధి కరువైంది. రూ.లక్షల విలువైన వాహనాలు తుప్పు పడుతున్నాయి. మున్సిపాలిటీకి సంబంధించిన రెండు ట్రాక్టర్లు, ఒక లారీ, 10 ఆటోలు పట్టణంలోని మిలటరీ కాలనీలో గల సంప్‌హౌస్‌ వద్ద మూలన పడేశారు. పదేళ్లుగా వాటిని పట్టించుకోకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పట్టి మట్టిలో కూరుకుపోతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ నవీన్‌ను వివరణ కోరగా, తనకు సమాచారం లేదని తెలిపారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement