సన్న ధాన్యానికి బోనస్ రావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ఈసారి నిబంధన పెట్టింది. 7 రకాల విత్తనాలను సాగుచేసిన రైతులు ఏ డీలర్ వద్ద కొనుగోలు చేశారో, ఆ రశీదు ఆధారంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. వారికే రూ.500 బోనస్ వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు. విత్తనాలు కొనుగోలు చేసి 2 నెలలు గడిచిపోయాయని, ఇప్పుడు రశీదు కోసం డీలర్ వద్దకు వెళ్లాలంటే ఎలాగని రైతులు మండి పడుతున్నారు. రశీదు పోయిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొర్రీలు పెట్టడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


