● కలెక్టర్ ప్రతిమాసింగ్
● ఘనంగా పాపన్నగౌడ్ జయంతి
మెదక్ కలెక్టరేట్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడిన బహుజన నాయకుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని జిల్లా కేంద్రంలోని పసుపులేరు ఒడ్డున ఘనంగా నిర్వహించారు. బీసీ వెల్ఫేర్, కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ అణగారిన వర్గాల, శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారిని ఎదిరించి పోరాడిన మహానీయుడన్నారు. కవులు, కళాకారులకు జిల్లా నిలయమని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర రచించి భావితరాలకు పుస్తక రూపంలో అందించాలన్నారు. చైతన్యానికి స్ఫూర్తి నిచ్చిన పోరాట యోధుని గాధలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. అనంతరం మెదక్ సమీకృత కలెక్టర్‌లో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్‌తోపాటు పలు కుల సంఘాల నాయకులు పాల్గొని నివాలులు అర్పించారు. కార్యక్రమాల్లో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ , బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి గంగా కిషన్, ఎకై ్సజ్ సూపర్ ఇండెంట్ నరసింహారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


