మండిపడినఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్ రూరల్: టీఎస్ ఈసెట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు నర్సాపూర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ శక్తి వైఐఎస్‌యూ స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును నీరుగార్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రశాంతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి, తన సిబ్బందితో కలిసి దురుసుగా ప్రవర్తిస్తూ వారిని రోడ్డు పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశారు. విద్యార్థుల చొక్కాలు పట్టుకొని లాగేశారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి మద్దతు
రాస్తారోకో చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. టీఎస్ ఈసెట్ కొనసాగించి, శక్తిని స్కీం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డిని ప్రశ్నించారు.
టీఎస్ ఈసెట్ కొనసాగించాలనిధర్నా
విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు


