మహిళా సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమమే లక్ష్యం

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

మెదక్‌ కలెక్టరేట్‌: మహిళా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గడ్డం వివేక్‌ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన మెదక్‌ కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొట్ట మొదటిసారిగా స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటితో రేషన్‌ పంపిణీలో అక్రమాలను అరికట్టడం జరుగుతుందన్నారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళలకు పెట్రోల్‌ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు, ఈ ఆటోలు, పావలావడ్డీ రుణాలు అందించనున్నారు. అలాగే జిల్లాలో మూడువేల వరకు ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

పెన్షన్ల కోసం రూ.3లక్షల కోట్లు

ప్రతినెల లబ్దిదారులందరికి పెన్షన్లు అందించడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ తెలిపారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం బ్యాంకర్లకు రూ.3కోట్లు కట్టామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు కోసం ఏడాదికి ఆర్టీసీ సంస్థకు రూ.14వేల కోట్లు కట్టినట్లు తెలిపారు. రూ.5లక్షలతో ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు ఉచిత కరెంట్‌, సన్నబియ్యం అందిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500లు అందజేయనున్నట్లు తెలిపారు.

నెలకు రూ.6వేల కోట్ల మిత్తి

బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని మంత్రి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు నెలకు రూ.6వేల కోట్ల మిత్తిలను ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. కాని ఒక్క రేషన్‌కార్డుగాని, ఒక్క ఇల్లుగాని, పింఛన్లు ఇవ్వలేదని ఆరోపించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌లు మాట్లాడారు. ఈ సందర్భంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

దేశంలోనే మొదటిసారి స్మార్ట్‌ రేషన్‌కార్డులు

పింఛన్ల కోసం రూ.3లక్షల కోట్లు

మహిళలకు పెట్రోల్‌ బంక్‌లు, సబ్సిడీ రుణాలు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement