చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. చిన్నశంకరంపేటకు సోమవారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుక్ చేసుకొనేందుకు ఇబ్బందులు పడ్డారు. తీరా బుక్ చేసుకున్నాక యూరియా కోసం రైతులు బారులు తీరడంతో క్యూలైన్‌లో ఉన్నవారికే ఇస్తామని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ వర్షం పడుతున్నా..రైతులు క్యూలో వేచి ఉండి యూరియా కొనుగోలు చేశారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లిలోని శ్రీభాగ్యలక్ష్మి ఫర్టిలైజర్స్‌కు సోమవారం 450బస్తాల యూరియా రావడంతో ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేంవర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) యాప్‌లో రైతులు బుక్ చేసుకున్నారు. కాగా, యూరియా బుక్ చేసుకున్న రైతులు ఒక్కసారిగా అక్కడకు వచ్చి బారులు తీరారు. షాప్ యజమాని ప్రభాకర్ క్యూర్‌కోడ్‌తో స్కాన్‌చేసి రైతులకు యూరియా పంపిణీ చేశారు.


