శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠంలో బుధవారం ఆషాఢ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
చేగుంట(తూప్రాన్): జిల్లాలోని రైతులంతా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని డీఏఓ దేవ్‌కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని చందాయిపేటలో పర్యటించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుంటే భవిష్యత్తులో వారికి వ్యవసాయ సంబంధమైన అంశాల్లో లబ్ధి జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నాయని, రైతులు ఆరుతడి, కూరగాయల పంటలు వేసుకోవాలని తెలిపా రు. ఆయన వెంట ఏఈఓ దివ్య, రైతు కోఆర్డినేటర్ అంజనేయులు, నాయకులు సాయిబాబా, అధికారి యాదగిరి తదితరులు ఉన్నారు.
పకడ్బందీగా ‘సర్’
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సర్ (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ )కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 67.06 శాతం నమోదైనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించా లని సూచించారు. ఇంటింటి సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని తెలిపారు. బూత్‌స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
మెదక్ ఖిల్లాకు కొత్త కళ
మెదక్ కలెక్టరేట్: మెదక్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముమ్మరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఖిల్లాపై జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం మెదక్ మున్సిపల్ కమీషనర్ నవీన్ పరిశీలించారు. మెదక్ ఖిల్లాను సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్లకు పలు సూచనలు చేశారు.
కాంగ్రెస్‌లో చేరికలు
రామాయంపేట(మెదక్): పట్టణానికి చెందిన రజక సంఘం సభ్యులు బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర నేత మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, సందీప్, రంజిత్, కోఆప్షన్ సభ్యుడు దేమె యాదగిరి, డీసీసీ కార్యదర్శి పోచమ్మల గణేశ్, సీనియర్ నాయకుడు సరాపు యాదగిరి, పట్ట ణాధ్యక్షుడు చింతల స్వామి, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు
న్యాయం చేయాలి
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేయాలని జిల్లా జేఏసీ సమన్వయ కమిటీ నాయకులు కొండల్‌రెడ్డి, యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం కేశవరావు నాయకత్వంలో గుర్తింపు కమిటీ నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు.


