జాతీయ యోగాసన పోటీలకు ఎంపిక
శిరీష
మనోజ
చేగుంట(తూప్రాన్): జాతీయ యోగాసన పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గణేశ్ రవికుమార్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో సౌత్‌జోన్ యోగాసన చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన శైనీ శిరీష, చిక్కుల మనోజ రిథమిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరిద్దరు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి యోగాసన పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మెదక్ ట్రైబల్ డిగ్రీ కళాశాల పీడీ రంగీలాతో పాటు యోగాసన అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ యోగాసన పోటీలకు ఎంపిక


