క్రీడలతో మానసికోల్లాసం
కొల్చారం(నర్సాపూర్): క్రీడలతో మానసికోల్లా సం కలుగుతుందని, గ్రామీణ యువత ప్రతిభ చాటేందుకు దోహదం చేస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పైతరలో జరిగిన పీపీఎల్ సీజన్– 3 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన జట్లకు మెడల్స్, ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాబన్నగారి రవితేజరెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఆదాం, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్‌గుప్తా, యువత అధ్యక్షుడు సంతోశ్‌రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్: మండలంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మండలంలోని ఇస్లాంపూర్, వెంకట రత్నాపూర్, మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపన్‌పల్లికి చెందిన నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, మహేందర్‌రెడ్డి, రమేశ్, మహేశ్, శ్రీశైలం, నగేష్, నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రేగోడ్(మెదక్): వాహనదారులు నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ మహేందర్ సూ చించారు. మండలంలోని చౌదర్‌పల్లిలో బుధవారం సర్పంచ్ సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ పండగలను ప్రతీ ఒక్కరూ జరుపుకోవాలని కోరారు. మద్య సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా రేగోడ్‌లో కొనసాగుతున్న టోర్నమెంట్‌కు హాజరై క్రీడాకారులకు సూచనలు ఇచ్చా రు. కార్యక్రమంలో ఎస్‌ఐ పోచయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 19న కార్మిక, కర్షక ఐక్యత సభను నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. బుధవారం మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందన్నారు. 2019లో తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందన్నారు. వీటి రద్దు కోసం ఈనెల 19న సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షిక ఐక్యత సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని కార్మికులు, కర్షకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏ.మల్లేశం, కే.మల్లేశం, నర్స మ్మ, మహేందర్‌రెడ్డి, బస్వరాజు, గౌరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో మానసికోల్లాసం


