రామలింగేశ్వరాలయం ముస్తాబు
నేటి నుంచి 17 వరకు ఉత్సవాలు
ముస్తాబైన రామలింగేశ్వరాలయం, (ఇన్‌సెట్) గర్భగుడిలోని స్వయంభు రామలింగేశ్వరుడు
తూప్రాన్: మండలంలోని ఇస్లాంపూర్ శివారు రామలింగేశ్వరాలయం విశిష్ట ప్రాచుర్యం పొందింది. ఇక్కడ పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఏటా మకర సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకలకు ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఏళ్ల క్రితం భూమి నుంచి 300 అడుగుల ఎత్తులో ఇక్కడ రామలింగేశ్వరాలయాన్ని నిర్మించారు. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో తిరుగుతున్నప్పుడు ఈ ఆలయంలో పూజలు చేసినట్లు చెబుతారు. ఈనెల 15 నుంచి 17 వరకు జాతర ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారి శలాక ఆత్రేయశర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
రామలింగేశ్వరాలయం ముస్తాబు


