మౌలిక వసతులు కల్పించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. తాగునీటి సౌకర్యం, ర్యాంపులు ఉండేలా చూసుకోవాలన్నారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని పీహె చ్‌సీ, సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని పరిశీలించారు. మిగిలిపోయిన పనుల గురించి కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేస్తుందన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందించాలని, అనుమతి లేనిదే సెలవులో వెళ్లవద్దని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ ఎలిజిబెత్‌రాణి, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


