బాల్యవివాహాలకు చెక్
ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మి
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాలు, తండాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐసీడీఎస్ రాయిలాపూర్ సెక్టార్ సూపర్‌వైజర్ లక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని పాంపల్లిలో ఏఎల్‌ఎంఎస్ (అంగన్‌వాడీ లేవల్ మానిటరింగ్ అండ్ సపోట్) కమిటీ, లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచ్ యశోదను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ రాణి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తేల్చి చెప్పినప మిర్జాపల్లి వాసులు
చిన్నశంకరంపేట(మెదక్): రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తేనే డబుల్‌లైన్‌కు అవసరమైన భూములు ఇస్తామని చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు రైల్వే అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గ్రామానికి వెళ్లే రైల్వే బ్రిడ్జిని రైల్వే ఇంజనీర్ రాకేశ్, భూసేకరణ అధికారి రమేశ్ తహసీల్దార్ మాలతి, ఆర్‌ఐ రాజు, సర్వేయర్ దుర్గాభవాని పరిశీలించారు. అండర్‌పాస్ రైల్వే బ్రిడ్జిలోకి చెరువు బ్యాక్ వాటర్ చేరి గ్రామానికి దారి లేకుండా పోతుందని గ్రామస్తులు అధికారుల వద్ద వాపోయారు. బ్రిడ్జిని మరో చోటుకు మార్చడమా లేదా తమకు ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు దారి విషయంలో స్పష్టత ఇచ్చిన తరువాతనే తమ భూములు సర్వే చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రమణ, మాజీ ఉపసర్పంచ్ మనోజ్, గ్రామ నాయకులు గంగాదర్‌గౌడ్, యాదగిరి ఉన్నారు.
సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్‌చంద్రబోస్
హవేళిఘణాపూర్(మెదక్): వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని మెదక్ సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్‌చంద్రబోస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముత్తాయికోటలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ శ్వేత, సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గుండారం కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.
తూప్రాన్‌లో ‘అరైవ్ అలైవ్’పై అవగాహన
తూప్రాన్: రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రంగకృష్ణ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపకూడదని, అధిక వేగం నివారించాల్సిన అవసరం వంటి ముఖ్య అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు జ్యోతి, యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.
బాల్యవివాహాలకు చెక్
బాల్యవివాహాలకు చెక్


