నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో రూ. రెండు వందల కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సముదాయం నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులను కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. త్వరితగతిన నిర్మాణం పనులు ప్రారంభించాలన్నారు. మారుమూల గ్రామాల విద్యార్థుల ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ స్కూలు దోహదపడుతుందని చెప్పారు. స్కూలు నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్థలసేకరణ, పనుల పురోగతికి సంబంధించి వివరాలు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక తహసీల్దార్ రజని, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్
అత్యుత్తమ సేవలందించాలి
మెదక్ కలెక్టరేట్: అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్‌కు చెందిన టేబుల్ క్యాలెండర్, వాల్ క్యాలెండర్లను అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్‌తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె సీమలు, పశుసంవద, వ్యవసాయ, ఉద్యాన పంటలతో సుభిక్షంగా కళకళలాడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి నాగభూషణం, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్, ఎల్లయ్య, మహేష్, సౌజన్య, మధులత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సంరక్షణ కిట్ల పంపిణీ హర్షణీయం
అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు పురుగు మందులు పిచికారీ చేసే క్రమంలో వారి ఆరోగ్య పరిరక్షణకై సంరక్షణ కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. రైతులకు ఇలాంటి పరికరాలు అందజేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


