సకాలంలో వైద్యం అందించాలి
రామాయంపేట(మెదక్): మండలంలోని ప్ర గతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్‌ఓ శ్రీరాం సందర్శించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించా రు. అనంతరం ఆస్పత్రి ఆవరణతో పాటు రికార్డులను పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ వెంట ఏఓ హరిప్రసాద్, పీఓ నవ్య, డీడీఓ రేఖ, ఇతర అధికారులు ఉన్నారు.
నాలుగు లేబర్‌కోడ్‌లు
రద్దు చేయాలి: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్: కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలనే డి మాండ్‌తో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలు రద్దు చేసిందని మండిపడ్డారు. లేబర్‌కోడ్‌లు అమలు కాకుండా రాష్ట్ర ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జి ల్లా కోశా ధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్య క్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: నగేశ్
మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 44 వినతులు అందజే శారు. ఇందులో భూభారతి 32, పెన్షన్ల కోసం 2, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలపై 9 వచ్చాయి. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ భు జంగరావుతో పాటు ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో స్వామి వివేకానంద వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు.
వివేకానంద స్ఫూర్తితో
ముందుకు సాగాలి
చిన్నశంకరంపేట(మెదక్): స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకులు ముందుకు సాగాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని చందంపేటలో సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామ గ్రంథాలయం, నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ప్రజల కోసం ప్రతి ఆరు నెలలకోసారి స్థానిక పరిశ్రమ సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయంలో తన వంతుగా రూ. 2 వేల పుస్తకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నారాయణగౌడ్, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ రమేశ్, బలరామ్, శ్రీనివాస్, దత్తుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
సకాలంలో వైద్యం అందించాలి
సకాలంలో వైద్యం అందించాలి
సకాలంలో వైద్యం అందించాలి


