పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Jan 12 2026 7:46 AM | Updated on Jan 12 2026 7:46 AM

పెండి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

చిన్నశంకరంపేట(మెదక్‌): ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయా లని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మాట్లా డుతూ.. నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సిన డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరో వైపు ఆరోగ్య భద్రత కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికే బకాయిపడిన 5 డీఏలు, పీఆర్‌సీ, ఈహెచ్‌ఎస్‌ పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.

కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలం

కౌడిపల్లి(నర్సాపూర్‌): కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలం అని, వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మా ట్లాడారు. అధికార పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, సర్పంచ్‌లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కల్లబొల్లిమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ఆరు గ్యారంటీలు అమలులో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ప్రభుత్వ భూమలు అమ్మడం, దోచుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. అనంతరం పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు రామాగౌడ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షు డు శ్రీనివాస్‌, నాయకులు నవీన్‌కుమార్‌, మహిపాల్‌రెడ్డి, కాంతారావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

మెదక్‌జోన్‌: రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బూత్‌ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈనెల 25 వరకు బూత్‌ స్థాయిలో లోటు పాట్లు సరిచేసు కోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు గడ్డం శ్రీనివాస్‌, రంజిత్‌రెడ్డి, పంజా విజయ్‌, నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బంగారమ్మకు మొక్కులు

మనోహరాబాద్‌(తూప్రాన్‌): వారాంతపు సెలవు దినం కావడంతో కాళ్లకల్‌ బంగారమ్మ దేవాలయంలోని వనదుర్గా అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. ఒడిబియ్యం సమర్పి ంచి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన పూజారి వేణుగోపాల్‌శర్మ తీర్థ ప్రసాదాలను అందించారు.

ఉపాధి రద్దుకు కేంద్రం కుట్ర

రామాయంపేట(మెదక్‌): కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి కుట్ర పన్నుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరుయాత్ర ఆదివారం రామాయంపేట చేరుకోగా ఆమె మాట్లాడారు. కేంద్ర వైఖరిపై కార్మికులను చైతన్యపర్చేందుకు ఈనెల 8న మెదక్‌లో పోరుయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. వందలాది మంది కార్మికులతో కలిసి ఈనెల 12న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఏకం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
1
1/3

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
2
2/3

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
3
3/3

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement