రిజర్వేషన్‌ కలిసొచ్చేనా..? | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్‌ కలిసొచ్చేనా..?

Jan 12 2026 7:46 AM | Updated on Jan 12 2026 7:46 AM

రిజర్వేషన్‌ కలిసొచ్చేనా..?

రిజర్వేషన్‌ కలిసొచ్చేనా..?

మెదక్‌జోన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. సోమవారం వార్డుల వా రీగా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఏ క్షణమైన షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టిసారించాయి.

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు

జిల్లాలో మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి బల్దియాలపై జెండా ఎగరవేయాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. కాగా రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా..? లేదా..? ఒకవేళ ఆశించిన స్థానంలో రిజర్వేషన్‌ మహిళలకు వస్తే ఆశావహులు వారి భార్యలు, తల్లులను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పనిచేసిన సీనియర్‌ నేతలు ఏకంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవిపై కన్నేశారు. అంతేకాకుండా పోటీలో నిలిచే తమ పార్టీ కౌన్సిలర్లకు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చేందుకు సైతం వెనకాడటం లేదు. గెలుపొందిన తర్వాత తనకు మద్దతు ఇవ్వాలని మచ్చిక చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆశించిన వార్డులో రిజర్వేషన్‌ కలిసి రాకపోతే మరోవార్డు నుంచి అయినా బీఫాం ఇవ్వాలని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది.

ఓటరు జాబితానే ప్రామాణికం!

ఈనెల 16న తుది ఫొటో గుర్తింపు ఓటరు జా బితా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా 2020 ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం 10 ఏళ్ల పాటు ఇవే రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. కానీ ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో వా టిని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. అదే విధంగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల మార్పు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

ఏ క్షణమైనా నోటిఫికేషన్‌

మెదక్‌ మున్సిపాలిటీ: ఏ క్షణమైనా మున్సిపల్‌ ఎ న్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. ఆదివారం మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితాను పరిశీలించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్‌ ఏ సమయంలోనైనా విడుదల కావొచ్చని, విధుల నిర్వహణకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యలకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. తుది ఓటరు జాబితా తయారీలో ఎన్నికల నిబంధనలు పాటించినట్లు వివరించారు. కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి భూపతి, మేనేజర్‌ భవాని, ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పేరున్న నేతలకు గాలం

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్‌ అనుకూలంగా వస్తే చైర్మన్‌గా అవకాశం ఇస్తామని ఆఫర్‌ ఇస్తున్నారు. అలాగే మరికొంత మంది పేరున్న నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో అధికార కాంగ్రెస్‌ నేతలు నిమగ్నమయ్యారు.

పోటీకి సిద్ధమవుతున్న

ఆశావహులు

అవకాశం ఇవ్వాలంటూ

ముఖ్య నేతలకు విన్నపాలు

నేడు ఓటర్ల

తుది జాబితా విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement