పోరాట యోధుడు వడ్డే ఓబన్న
మెదక్ కలెక్టరేట్: పీడిత వర్గాల పోరాట యోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టర్ రాహుల్‌రాజ్ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచి మాట్లాడారు. తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు ఓబన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గ సాయిలు, జిల్లా గౌరవ అధ్యక్షుడు పెంటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, ఉపాధ్యక్షులు ఎల్లయ్య, సంపంగి, శ్రీను, భిక్షపతి, నర్సింలు, మధు, ఎల్లం, శ్రీశైలం, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


