జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
చేగుంట(తూప్రాన్): జాతీయస్థాయి రగ్బీ పోటీలకు జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ కరణం గణేశ్‌రవికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బోయిన్‌పల్లిలో అండర్ 15 రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. జిల్లా బాలికల టీం రెండోస్థానంలో నిలువగా, బాలుర టీం మూడో స్థానంలో నిలిచిందన్నారు. బాలికల విభాగంలో హరిణి, కీర్తన, నందిని, అర్చన, వర్షశ్రీ, లావణ్య, రక్షిత, బాలుర విభాగంలో విష్ణు, రఘునందన్, వేణుగోపాల్ ఎంపికయ్యారని వివరించారు. వీరంతా ఈనెల 15 నుంచి 21 వరకు భువనేశ్వర్‌లో జరిగే రగ్బీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.


