శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026

Jan 10 2026 9:26 AM | Updated on Jan 10 2026 9:26 AM

శనివా

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026 మెదక్‌మున్సిపాలిటీ: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేకంగా 87 బస్సులు నడిపించనున్నారు. తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కాగా ప్రస్తుతం ఉన్న ధరల కంటే 50 శాతం టికెట్‌ చార్జీలు పెంచనున్నారు. ఇది ప్రయాణికులపై భారం పడనుంది. ప్రత్యేక బస్సులే అయినా.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయా ణం వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు విద్యాసంస్థలకు పండుగ సెలవులు ప్రకటించింది. ఆదివారం నుంచి ప్రజలు సొంతూరు బాట పట్టే అవకాశం ఉంది. బస్టాండ్లు కిటకిటలాడనున్నాయి. మెదక్‌ ఆర్టీసీ డిపో నుంచి 55, నర్సాపూర్‌ నుంచి 37 ప్రత్యేక బస్సులు నడిపించనున్న ట్లు డీఎం సురేఖ చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 90 బస్సులు నడుస్తున్నాయన్నారు. వీటితో పాటు మరో 87 బ స్సులు నడిపించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌ (జేబీఎస్‌), సిద్దిపేట, సంగారెడ్డి, బొడ్మట్‌పల్లి రూట్ల లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు నడుస్తాయ ని వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

న్యూస్‌రీల్‌

92 సర్వీసులు నడపనున్న ఆర్టీసీ

తిరుగు ప్రయాణంలో ఇబ్బందులులేకుండా చర్యలు

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

ఈ రూట్లలో..

దుప్పట్లు పంచి.. చలి నుంచి రక్షించి

కలెక్టర్‌ వినూత్న కార్యక్రమం

నీటి విడుదలకు కలెక్టర్‌ అనుమతి!

ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్ల (8.1 టీఎంసీ)కు తగ్గిస్తే ఈ సీజనులో కొంత మేరకు కట్ట బలోపేతం పనులు చేసేందుకు వీలుంటుంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌తో పాటు, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 8.1 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆది లేదా సోమవారం గానీ ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఐదు వేల క్యూసెక్కు నీటి విడుదల ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నీటిని వదిలేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి రాగా, కలెక్టర్‌ పి.ప్రావీణ్య అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 20261
1/1

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement