జిల్లాకు 6 బహుమతులు మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి వ
నేడు, రేపు విద్యుత్
సరఫరాలో అంతరాయం
మెదక్ కలెక్టరేట్: మెదక్‌లో రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్‌బాబు, టౌన్ ఏఈ నవీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మరమ్మతులు, ఎర్తింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు మరమ్మతులు చేపడుతున్నామని, తమకు సహకరించాలని కోరారు.


