మెనూ ప్రకారం భోజనం అందించాలి
మనోహరాబాద్(తూప్రాన్): ప్రభుత్వం మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కూచారం కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులు, వంట గది, పరిసరాలను పరిశీలించారు. వంటగది ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించా రు. అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయ హుండీ ఆదాయం రూ. 5,45,476 వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌స్పెక్టర్, ఆలయ ఇన్‌చార్జి ఈఓ రంగారావు ఆధ్వర్యంలో నాలుగున్నర నెలలకు సంబంధించి భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు చేపట్టారు. డబ్బులు దేవాదాయశాఖలో జమచేసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. కార్యక్రమంలో కూచన్‌పల్లి ఈఓ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ధర్మకర్తలు ప్రభుచారి, బాలరాజు, శంకర్‌గౌడ్, మాజీ చైర్మన్ చెల్ల మల్లేశం, ఏఎస్‌ఐ మల్లయ్య, శివకేశవ స్వచ్ఛంద సేవాసమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నర్సాపూర్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియెట్ ప్రత్యేకాధికారి కిషన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున బాగా చదవాలని, సమయం వృథా చేయవద్దని హితవు పలికారు. అనంతరం డీఐఈఓ మాధవితో కలిసి తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలె ండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషాచారి, అధ్యాపకులు పాల్గొన్నారు. లె
నల్లపోచమ్మ హుండీ ఆదాయం రూ.5.45 లక్షలు
సమయం వృథా చేయొద్దు
ప్రత్యేక జీపీగా ప్రకటించాలి
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శుక్రవారం రిలే దీక్షలు ప్రారంభించారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలో చేర్చడం వల్ల తాము అన్ని విధాలుగా నష్టపోతున్నామని వాపోయారు. ఉపాధి పనులకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు తమ ఇంటి పన్నులు సైతం విపరీతంగా పెరిగాయన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీ ను ంచి తొలగించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని లంబాడి ఐక్య వేదిక కోఆర్డినేటర్ సురేశ్‌నాయక్ హెచ్చరించారు.
‘లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి’
టేక్మాల్(మెదక్): కార్మికుల పొట్టకొట్టే విధంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం టేక్మాల్‌కు జీపు జాత రా గా, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నీరుగార్చే చర్యలు సరికాదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
1/2
మెనూ ప్రకారం భోజనం అందించాలి
2/2
మెనూ ప్రకారం భోజనం అందించాలి