గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
సీఎం కప్ ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్
మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం(నర్సాపూర్): గ్రా మీణ యువత క్రీడల్లో రాణించాలని కలెక్టర్ రాహు ల్‌రాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో సీఎం కప్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రో త్సహించడమే సీఎం కప్ లక్ష్యమన్నా రు. ఆసక్తి గల క్రీడాకారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. యువత, చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. ర్యా లీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్‌సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొల్చారం కేజీబీవీని తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రత, భోజనంపై ఆరా తీశారు. పరిసరాల పరిశుభ్రత లోపించడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను పర్యవేక్షించాలని సూచించారు. సంక్రాంతి సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి వచ్చేసరికి వసతి గృహ ఆవరణ పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలన్నారు. కలెక్టర్ వెం డీఈఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, సిబ్బంది ఉన్నారు.


