ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
మెదక్‌జోన్/నర్సాపూర్/రామాయంపేట(మెదక్): పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికి వదిలేశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపుతానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ కింద కేంద్రం నుంచి ప్రతి జిల్లాకు నిధులు మంజూరైతే కేవలం సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్రమే వినియోగించారన్నారు. మెదక్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం డీపీఆర్ తయారు చేశామని, అనుమతులు రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. మార్చి 31 వరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ. 950 కోట్లు వాపస్ పోతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆరాట పడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు రంజిత్‌రెడ్డి, నందారెడ్డి, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నర్సాపూర్ మేజర్ పంచాయితీ నుంచి మున్సిపాలిటీగా మా రినా అభివృద్ధి అంతంతే జరిగిందన్నారు. నాయకులు సమష్టిగా ముందుకు సాగితే మున్సిపాలిటీని బీజేపీ కై వసం చేసుకుంటుందన్నారు. గెలిచే వ్యక్తులను మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేస్తారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేటలో పర్యటించారు. సంక్రాంతి పండుగను సద్వినియోగం చేసుకొని పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటు అడగాలని సూ చించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి నర్సింహారెడ్డి, నాయకులు నందారెడ్డి, శ్రీనివాస్, అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌గౌడ్, మండలశాఖ అధ్యక్షుడు నవీన్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి పాల్గొన్నారు.


