అవంచను సందర్శించిన యూపీ బృందం
నర్సాపూర్‌రూరల్: మండలంలోని అవంచ గ్రామాన్ని యూపీకి చెందిన జిల్లా, గ్రామస్థాయి అ ధికారులు, ప్రజాప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. గ్రామస్థాయిలో అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. అందులో భాగంగా గ్రామంలోని వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్‌తో పాటు శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్రస్థాయి చేస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామ పాలకవర్గం వారిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, కార్యదర్శి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


