ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు

Jan 8 2026 9:22 AM | Updated on Jan 8 2026 9:22 AM

ఎన్ని

ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026 జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీలు ఉండగా, 2020 లో జరిగిన పుర ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కాగా 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటంతో తూప్రాన్‌ మున్సిపాలిటీలోని మెజార్టీ కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరారు. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి పీఠం దక్కించుకున్నారు. అలాగే నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న మురళీయాదవ్‌ బీఆర్‌ఎస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతుందని అసమ్మతి రాగం వినిపించారు. దీంతో పార్టీ అతడిని సస్పెండ్‌ చేసింది. బీఆర్‌ఎస్‌కు చెందిన మరో కౌన్సిలర్‌ చెర్మన్‌గా కొనసాగారు. మెదక్‌ మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈక్రమంలో చైర్మన్‌ చంద్రపాల్‌ సైతం పార్టీ మారి పదవిని కాపాడుకున్నారు. రామాయంపేటలో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ చివరి వరకు కొనసాగా రు. కాగా త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెడుతున్నారు.

న్యూస్‌రీల్‌

పంచాయతీ ఎన్నికల్లో డీలా పడిన బీజేపీ, పట్టణ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తూప్రాన్‌లో పర్యటించారు. గెలుపు గుర్రాల జాబితా సి ద్ధం చేయాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. గురువారం మెదక్‌లోనూ పర్యటించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పట్టణాల్లో యువత బీ జేపీ వైపు ఉన్నారని, ఇది కలిసొచ్చే అంశమని భావిస్తున్నారు. దీంతో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు.

పల్లెపోరులో అధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పురపాలికల్లో పార్టీ జెండాను ఎగురవేసేందుకు నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. వారిలో ప్రజా మద్దతుతో పాటు ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని బీఫాంలు ఇవ్వాలని చూస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయని బలంగా నమ్ముతున్నారు.

పుర ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. బరిలో నిలిచే ఆశావహులు అంతర్గతంగా నాయకులతో చర్చిస్తున్నారు. హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని, ప్రభుత్వ వ్యతిరేకతను ఓటు రూపంలో మలుచుకోవాలని చూస్తున్నారు. అలాగే జిల్లాలో తాగు, సాగు నీరు ఇబ్బందులు, హల్దీ వాగు నుంచి ఇసుక తరలింపును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
పుర పోరులో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీలపై పార్టీ జెండాలను ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా, మున్సిపల్‌ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండటంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. – మెదక్‌జోన్‌

పుర పీఠంపై గురి!

సత్తా చాటాలని కమలం ఆరాటం

‘హస్త’గతం దిశగా సన్నద్ధం

గెలుపే లక్ష్యంగా కారు పయనం

గెలుపు గుర్రాల వేటలో నేతలు

మెజార్టీ స్థానాల్లో గెలుపునకు వ్యూహాలు

ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు1
1/1

ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement