వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈఓ
హవేళిఘణాపూర్(మెదక్): పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో విద్యార్థులు ఇప్పటి నుంచే సబ్జెక్టుల వారీగా చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ విజయ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సర్ధన, కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. ఉపాధ్యాయుల రిజిస్టర్‌ను పరిశీలించి విద్యాబోధన గురించి ఆరా తీశారు. 10వ తరగతి పరీక్షలు మరో రెండు నెలలు మాత్రమే ఉన్నందున విద్యార్థులు సమయం వృథా చేయకుండా చూడాలన్నారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంఈఓ మధుమోహన్, హెచ్‌ఎం వేణుశర్మ, ఉపాధ్యాయులు అనిత, శ్రీనివాస్, మల్లారెడ్డి ఉన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి నిబంధన తొలగించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్‌గౌడ్ కోరారు. బుధవారం పెద్దశంకరంపేటలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇదే అంశంపై ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పదవీ విరమణ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి, పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా అదనపు కార్యదర్శి అశోక్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ రూరల్: మండలంలోని జక్కపల్లి మోడల్ స్కూల్‌లో హిందీ టీచర్ పోస్టు ఖాళీగా ఉందని, అర్హత, ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిందీ బోధించేందుకు బీఈడీ, లేదా హెచ్‌పీటీ అర్హత ఉండాలన్నారు. విద్యాబోధనలో అనుభవం అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అభ్యర్థులను డెమో ద్వారా ఎంపిక చేస్తామని, పూర్తి వివరాలకు 9963699095 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కౌడిపల్లి(నర్సాపూర్)/కొల్చారం: కౌడిపల్లి 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ యాదగిరి, ఏఈఈ సాయికుమార్ తెలిపారు. మండలంలోని కౌడిపల్లి, కంచన్‌పల్లి, వెల్మకన్న, వెంకట్రావుపేట సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు. కొల్చారం మండలంలోని అన్ని విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ మహమూద్ తెలిపారు.
టీచర్లకు టెట్ నిబంధన
తొలగించాలి: ఎస్టీయూ
సమయపాలన తప్పనిసరి
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ ఆదేశించారు. బుధవారం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పి ంచాలని సూచించారు. అస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన పరీక్షలు, మందులు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. ఈసందర్భంగా వైద్యాధికారులు రవికుమార్, రేణుక, శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
1/1
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈఓ