గ్రామాల అభివృద్ధిలో మీరే కీలకం
మెదక్ కలెక్టరేట్: గ్రామాల అభివృద్ధిలో మీ పాత్ర కీలకం, ఆర్థిక క్రమశిక్షణతో వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, కార్యదర్శలతో సమీక్ష నిర్వ హించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. నేటి నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మహిళా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు మున్సిపల్ కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చలి నేపథ్యంలో పేద పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దుప్పట్ల అందజేయాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శులతోకలెక్టర్ రాహుల్‌రాజ్


