అట్టహాసంగా పీఎంశ్రీ క్రీడా పోటీలు
మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలో బుధవారం పీఎంశ్రీ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్ర భుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు జరగగా, అవుట్ డోర్ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 29 పాఠశాలలకు చెందిన 680 మంది బాల, బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి డీఈఓ విజయ హాజరై విజేతలకు బహుమతులతో పాటు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడిన ప్రతీ ఒక్కరూ విజేతలే అన్నారు. అనంతరం క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు మాధవరెడ్డి, వినోద్, శ్రీధర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, రవి, మధు, రాజేందర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న అధికారులు


