కేసీఆర్‌ను కలిసిన పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మంగళవారం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ఆయన వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
విద్యుత్ సమస్యల
సత్వర పరిష్కారం
ప్రజాబాటలో ఏడీ రమణారెడ్డి
బీడీ కార్మికుల సమస్యలు
పరిష్కరించాలి
ఏఐటీయూసీ కార్యదర్శి లక్ష్మణ్
నిజాంపేట(మెదక్): బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎ.లక్ష్మణ్ కోరారు. మంగళవారం నిజాంపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు దేశ వ్యాప్తంగా ఒకే వేతనం, వెయ్యి బీడీలకు రూ.300 అమలు చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పదవీ విరమణ అనంతరం గ్రాట్యూవిటీ డబ్బులు ఇవ్వాలన్నారు. కార్మికులకు 26 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. పీఎఫ్ ద్వారా పదవీ విరమణ చేసిన కార్మికులకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ. 5000లకు పెంచి అమలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, రాష్ట్ర ఉపాద్యాక్షులు శాంత, వి.అనసూయ, కార్యవర్గ సభ్యులు కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మికులతో
పనిచేయిస్తే చర్యలు
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
తూప్రాన్: పరిశ్రమల్లో చిన్నపిల్లలతో పని చేయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆర్డీఓ జయచంద్రారెడ్డి హెచ్చరించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ చట్ట విరుద్ధమని చెప్పారు. బాలల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మూలించాలని తెలిపారు. గ్రామాల పరిధిలో ఉన్న పరిశ్రమలు, వర్క్‌షాప్‌లు, దుకాణాలు, ఇటుక బట్టీలు, చిన్న తయారీ కేంద్రాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విముక్తి పొందిన బాలలకు విద్య, పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్
ప్రాక్టికల్స్: డీఐఈఓ మాధవి
మెదక్ కలెక్టరేట్: వచ్చేనెల 2వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు, 25 నుంచి థియరీ పరీక్షలు ఉంటాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 28 ప్రాక్టికల్ సెంటర్లు, 28 థియరీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆరు ఒకేషనల్ సెంటర్లు కూడా ఉంటాయని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,306, రెండో సంవత్సరంలో 6,017 మంది మొత్తం 12,323 మంది హాజరు కానున్నట్లు తెలిపారు.
కేసీఆర్‌ను కలిసిన పద్మారెడ్డి


