బోగస్ ఓట్లు ఉండొద్దు
మెదక్ కలెక్టరేట్: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా సూచనలు ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై గుర్తింపు ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్ ఓటర్లు ఉండరాదన్నారు. అదే సమయంలో అర్హులకు అన్యాయం జరగొద్దన్నారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, డీపీఓ యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


