పుర పోరు.. కసరత్తు జోరు
పుర పోరు.. కసరత్తు జోరు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల జిల్లాలో మెదక్, రామాయంపేట, తుప్రాన్, న ర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు కై వసం చేసుకొని ఊపు మీద ఉన్న అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే ఆశావహులు బీఫాం దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీ నుంచి బరిలోకి దిగితే గెలుపు సునాయాసం అవుతుందనే భావనలో ఉన్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పుర పోరుపై దృష్టి సారించింది. ఇదే ఉత్సాహంతో మున్సిపాలిటీల్లో పాగా వేయాలని చూస్తోంది. అయితే నేతల మధ్య సమన్వయ లోపం ఆ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో నామమాత్ర పోటీకే పరిమితం అయిన కమలం పార్టీ పట్టణ పోరులో పట్టు సాధించాలని చూస్తోంది. పట్టణాల్లో తమకు ఓటు బ్యాంకు, కేడర్ ఉందని, ఈ ఎన్నికల్లో సత్తా చూపుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయని గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, పంచాయతీ ఎన్నికల మాదిరిగా ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉంది. దీంతో ఏ వార్డు ఎవరికి కేటాయిస్తారో అని నాయకులు కలవరపడుతున్నారు. కొందరు నే తలు వారికి అనుకూలంగా రిజర్వేషన్ వచ్చే విధంగా పెద్ద నేతలను వేడుకుంటున్నట్లు తెలిసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో జిల్లా యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించారు. సోమ వారం పార్టీల నేతలతో కమిషనర్లు సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే మంగళవారం కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఈనెల 10న తుది ఓటరు జాబితాను అధికారికంగా పోలింగ్ బూత్‌ల వారీగా ప్రకటిస్తారు.
నేతలతో మున్సిపల్ కమిషనర్ల సమావేశం ఈనెల 10న తుది జాబితా వెల్లడి రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన పల్లె పోరు ముగియడంతో ఇక పట్టణ పోరుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం సైతం కసరత్తు ప్రారంభించింది. ఇదే క్రమంలో ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగనుండటంతో అందుకు సన్నద్ధమవుతున్నాయి. – మెదక్‌జోన్
ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల
రిజర్వేషన్లపై ఉత్కంఠ..!
తప్పుల
తడకగా
జాబితా
మున్సిపాలిటీల్లో ఇటీవల అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, వాటిలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని వెంటనే సరి చేసి ఫైనల్ ఓటర్ లిస్టును వార్డుల్లో ప్రదర్శించాలని బీఆర్‌ఎస్ నేతలు ఇటీవల మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఓటు హక్కు ఉండాల్సి ఉండగా, కొన్ని వార్డుల్లో ఒకే కుటుంబీకుల ఓట్లు రెండు, మూడు వార్డుల్లో ఉన్నాయని ఆరోపించారు.
1/1
పుర పోరు.. కసరత్తు జోరు