నేరుగా సంప్రదించాలి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాసరావు హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వివాదాలను, పోలీస్ సంబంధిత ఇబ్బందులను ఎస్పీకి నేరుగా వివరించారు. పరిష్కరించాలని వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రజావాణి ద్వారా పరిష్కారమైన అనేక కేసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని తెలిపారు.
మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కృషి
మెదక్‌కలెక్టరేట్: మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించిందని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష న్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అర్హులు ఈనెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.


